జనగామ, 2026-06-05
జగజలలలోఘోోజగ.గలోస.ఈఘటసథగష.
జనగామ మండలం గానుగుపహాడకు చెందిన కన్నెబోయిన ప్రవీణ్ (24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ నెల 27వ తేదీన ద్విచక్రవాహనంపై నర్మెట్ట మండలం వెల్దండకు వెళ్లి తిరిగి వస్తుండగా, వెంకిర్యాల శివారులో అకస్మాత్తుగా అడవి పంది రోడ్డుకు అడ్డంగా వచ్చింది. దానిని ఢీకొని ప్రవీణ్ అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి.
చికిత్స పొందుతూ మృతి
గాయాలైన ప్రవీణ్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ప్రవీణ్ కు రెండు నెలల క్రితమే వివాహం జరిగింది.












