బచ్చన్నపేట్, 2026-11-24
కార్తీక దీపాలతో దేదీప్యమానంగా ఆలయం.. అన్నదాన కార్యక్రమం..
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బండనాగారం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర లక్ష్మీనరసింహ స్వామి బండతీర్థం ఉత్సవాలను కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. నూతనంగా నిర్మించిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో కార్తీక దీపాలు వెలిగించి, కుటుంబ సుఖసంతోషాలు, గ్రామ సుభిక్షత కోసం ప్రార్థించారు.
వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ గర్భాలయంలో నీటి బిందువులు కనిపించడంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిని స్వామివారి మహిమగా భావించి, భక్తులు ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి జంగిలీ ఆంజనేయులు, గురుస్వామి జంగిలి శ్రీరామ్, సర్పంచ్ ఇజ్జగిరి రాములు, కొల్ల నర్సిరెడ్డి, కొల్ల మహిపాల్ రెడ్డి, కొప్పురపు విప్లవ్ రెడ్డి, కొప్పురపు రాజేంద్రప్రసాద్ రెడ్డి, మాజీ సర్పంచ్లు చల్ల సుధాకర్ రెడ్డి, శ్రీలత శ్రీనివాస్ రెడ్డి, శివరాత్రి కవిత, రాజే నరసయ్య, డాక్టర్ రాజు, రాపేల్లి జనార్ధన్, డాక్టర్ రాపేల్లి చక్రపాణి, పల్లపు రామకృష్ణ, గూడెంల ప్రభాకర్, ఇళ్ల చంద్రారెడ్డి, ఇజ్జగిరి నరేష్, నిడిగొండ సత్తయ్య, ఆరేళ్ల భాస్కర్, నల్ల సత్తిరెడ్డి, ఇజ్జగిరి పరుశరాములు, సారాజు రమేష్, దామెర సురేష్తో పాటు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


