బీఆర్ఎస్ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 10
మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన యువ నాయకుడు
జనగామ జిల్లా యువ నాయకుడు కేశిరెడ్డి రాకేష్ రెడ్డి రాజవరం గ్రామంలో పర్యటించి, ఇటీవల మృతి చెందిన ఇల్లందు యాదయ్య పార్ధివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.యాదయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా యువ నాయకుడు కేశిరెడ్డి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ... యాదయ్య మృతి గ్రామానికి తీరని లోటని, ఆయన కుటుంబానికి ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,వారి బాధలో భాగస్వామిగా ఉంటానని పేర్కొన్నారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబానికి మనోధైర్యం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
కష్టసుఖాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజవరం గ్రామానికి చెందిన నాయకులు,కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వారు ఇల్లందు యాదయ్యకు నివాళులర్పించారు.

