తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత నివాసంపై డ్రోన్ కలకలం సృష్టించింది. మంగళవారం సాయంత్రం బంజారాహిల్స్ లోని ఆమె నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ను ఎగురవేశారు. తమ అధినేత నివాసంపై డ్రోన్ ఎగురవేయడంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు.
పోలీసులకు ఫిర్యాదు
ఈ ఘటనపై కవిత కార్యాలయ సిబ్బంది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలకు దీటుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కవిత గారిని, ఈక్రమంలో ప్రధాన రాజకీయ పార్టీలు లక్ష్యంగా చేసుకున్నాయని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

