తరిగొప్పుల, 19 November
ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇవ్వాలి అధికారులకు సూచన బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఏడేల్లి శ్రీనివాస్ రెడ్డి
మండల కేంద్రంలో నిర్వహించిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చోటుచేసుకున్న ప్రోటోకాల్ వివాదంపై బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఏడేల్లి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి హోదాకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ నిబంధనలను విస్మరించడం తగదని ఆయన అన్నారు. ప్రజలచే ఎన్నికైన ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించకూడదని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ వివాదాలకు తావులేకుండా అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని, ప్రజాప్రతినిధుల మధ్య పరస్పర గౌరవం పాటించాలని ఆయన కోరారు.
ప్రజా సంక్షేమ కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఏడేల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.


