Jangaon/Tharigoppula (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 14
తరిగొప్పుల పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చెన్నకేశవులను పలువురు ఫోటోగ్రాఫర్లు మర్యాదపూర్వకంగా కలిశారు.
తరిగొప్పుల పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చెన్నకేశవులను తరిగొప్పుల ఫోటోగ్రాఫర్స్ గౌరవ అధ్యక్షుడు, బొంతగట్టునాగారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నామ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు ఫోటోగ్రాఫర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సై చెన్నకేశవులకు శాలువా కప్పి సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎస్సై చెన్నకేశవులు మాట్లాడుతూ... మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని, పోలీసులకు ప్రజలు సహకరిస్తే మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు బైరి సాయికుమార్, శ్యామ్, రవి తదితరులు పాల్గొన్నారు.

