జాప్యంపై (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 13
రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదు - సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలి
రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే పూర్తిస్థాయిలో ప్రారంభించాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం చేర్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మిల్లులకు ట్యాగింగ్ పూర్తి చేసి, సన్న వడ్ల బోనస్‌పై తక్షణమే జీవో విడుదల చేయాలని కోరారు.
పంట దిగుబడి తగ్గడంతో వ్యాపారులు, దళారులు సిండికేట్‌గా ఏర్పడి ధాన్యం ధరలను తగ్గిస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులు తొందరపడి తక్కువ ధరకు ధాన్యం విక్రయించవద్దని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జిల్లా కలెక్టర్‌తో మాట్లాడానని, వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
తపాసుపల్లి నుంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేలా వెంటనే నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

