*కొమురవెల్లి (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 12
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేక్ కట్ చేశారు.
కొమురవెల్లి, సిద్దిపేట జిల్లా: కొమురవెల్లి మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్, కొమురవెల్లి గ్రామ శాఖ అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్, ఫ్యాక్స్ ఛెర్మెన్ మెరుగు కృష్ణ, జిల్లా కార్యదర్శులు మెరుగు శ్రీనివాస్, సానాది భాస్కర్, చెరుకు రమణా రెడ్డి, మాజీ ఎంపిటిసి లింగంపల్లి కనకరాజు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏర్పుల రాజు, యూత్ కాంగ్రెస్ మండల కార్యదర్శులు ఉప్పల వంశీ, యేనిశేట్టి కిరణ్, గుండా మహేష్, కొయ్యడ ప్రశాంత్, దువ్వల శ్రీనివాస్, కానుగుల బాబు, మేడికుంట శ్రీనివాస్, బొచ్చు ఎల్లయ్య, లింగంపల్లి మహేష్, రవి, మధు తదితరులు పాల్గొన్నారు.

