హైదరాబాద్, 12 November
15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
హైదరాబాద్: అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ జానయ్యపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
విచారణ కమిటీ వివరాలు
ఈ కమిటీలో నలుగురు ఐఏఎస్ అధికారులు, ఒక ఎన్జీవో సంస్థ నిర్వాహకురాలు సభ్యులుగా ఉంటారు. స్టేట్ వేర్ హౌజ్ కార్పొరేషన్ ఎండి కె. లక్ష్మీని విచారణ కమిటీ చైర్మన్గా, రాహుల్ రాజ్, యాస్మిన్ భాషా, బి. గోపిలను సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
ఈ విచారణను 15 రోజుల్లో పూర్తి చేసి, నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని కమిటీ సభ్యులను ఆదేశించింది.
