కోహెడ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 12
సిద్దిపేట జిల్లా మండలం గుండారెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించనున్న బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవానికి హాజరుకావాలని కోరుతూ గ్రామ సర్పంచ్ పిల్లి బాబు కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రికి అందజేశారు.

అనంతరం, గ్రామంలో నిర్వహించనున్న బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ విశేషాలను వివరించారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై, వేడుకలను విజయవంతం చేయాలని ప్రత్యేకంగా కోరారు.
ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరి భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్పంచ్ పిల్లి బాబు తెలిపారు.