స్పీడ్ వాకింగ్లో స్వామి, జోష్ణవికి ప్రథమ బహుమతులు
తెలంగాణ రైసింగ్ 247 కార్యక్రమంలో , మండల స్థాయిలో బహుమతులు సాధించిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో మద్దూరు ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న గుజరాతి స్వామి, ఎలిమెంటరీ స్థాయిలో జరిగిన స్పీడ్ వాకింగ్ పోటీలలో మొదటి బహుమతి సాధించారు. అదేవిధంగా, మద్దూరులోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తలరి జోష్ణవి, మహిళల స్పీడ్ వాకింగ్ లో మొదటి బహుమతి, మ్యూజికల్ చైర్ పోటీలలో రెండవ బహుమతి సాధించారు. విజేతలను మండల విద్యాధికారి వరదరాజు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ స్వప్న, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామేశ్వర్ రెడ్డి, ఐఆర్పీలు లక్ష్మణ్, మనిషా, స్పెషల్ ఎడిటర్ రాజశేఖర్ అభినందించారు. విద్యార్థుల ప్రతిభను కొనియాడుతూ, వారిని ప్రోత్సహించారు.










