తరిగొప్పుల, 10 November
లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి అండగా నిలిచినందుకు ఎమ్మెల్యేలు పరామర్శ,ఆర్థిక సహాయం
బచ్చన్నపేట మండలానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు లక్ష్మణ్ గౌడ్ మృతి పట్ల పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మండలంలో బొత్తలపర్రె సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం తరఫున భూక్య రవి నాయక్ బీఆర్ఎస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
మృతుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని, పిల్లల చదువుకు పూర్తి అండగా ఉంటామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి భరోసా కల్పించారు. ఈ సహాయం, భరోసా అందించిన హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి లకు సర్పంచ్ భూక్య రవి నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా భూక్య రవి నాయక్ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడమే కేసీఆర్ నాయకత్వ ప్రత్యేకత అని అన్నారు.
కార్యకర్తల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలుస్తూ, వారి బాధ్యతను తన బాధ్యతగా భావించే బీఆర్ఎస్ నాయకత్వం ఉండటం గర్వకారణమని ఆయన అన్నారు. ఇలాంటి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని ఆయన తెలిపారు.

