మెడ్చల్, 15 November
కుత్బుల్లాపూర్ పరిధిలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బౌరంపేట బొడ్రాయి సమీపంలో ఉన్న ఒక గ్యారేజ్‌లో పార్క్ చేసి ఉన్న 5 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. సమీపంలో పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
కుత్బుల్లాపూర్ పరిధిలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బౌరంపేట బొడ్రాయి సమీపంలో ఉన్న ఒక గ్యారేజ్‌లో పార్క్ చేసి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అగ్నికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో 5 బస్సులు పూర్తిగా కాలిపోయాయి.
ప్రమాద స్థలానికి సమీపంలో పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్యారేజ్ సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. బస్సులు పక్కపక్కనే పార్క్ చేసి ఉండటంతో మంటలు ఒకదానికొకటి వ్యాపించాయి.
దట్టమైన పొగలు వ్యాపించడంతో పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.
ఆస్తి నష్టం ఎంత మేర జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

