- జన సంద్రంగా మారిన నర్మెట్ట
మండల కేంద్రంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానిక సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆయుధ పూజ, జమ్మి పూజ, మైసమ్మ దేవత వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో గ్రామంలో పండుగ సందడి నెలకొంది.
దసరా ఉత్సవాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కోలేపాక స్వామి, వార్డు సభ్యులు యాదగిరి, పులి రేణుక కనకయ్య, గోరంతల స్వాతి రాజు, బండి నాగరాజు, పాతూరి ప్రశాంత్, చెప్యాల మహిపాల్, గుర్రాల పద్మ, మిడుదుల రత్నమాల రాజు, కూకట్ల మమత సంపత్, తుప్పుడు శ్రావణి మహేష్, కొన్నే యదలక్ష్మీ చంద్రయ్య, వివిధ కుల సంఘాల పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.










