జనగామ జిల్లా మండలంలోని వెల్దండ గ్రామంలో విజయదశమి (దసరా) ఉత్సవాలను మంగళవారం సర్పంచ్ కంతి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆయుధ పూజ, జమ్మి పూజతో పాటు మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పండుగను పురస్కరించుకొని గ్రామంలో పండుగ సందడి నెలకొంది. గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని విజయదశమి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో సిర్ర రాజీరెడ్డి, ఉపసర్పంచ్ బుస్సీ లతా, వార్డు సభ్యులు చెవుల ఓజలు, కళ్యాణం ఉప్పలమ్మ, గూటం చంద్రయ్య, గూటం విష్ణు, కళ్యాణం విజయ, మార్క మహేష్, పిట్టల కృష్ణమూర్తి, బొల్లం అవినాష్‌తో పాటు వివిధ కుల సంఘాల పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.