సారాంశం
గ్రామ ప్రజల సుఖసంతోషాలు, పాడిపంటల సమృద్ధి, రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ మొక్కులు చెల్లించుకున్న సర్పంచ్
ముఖ్య విషయాలు
- 1తరిగొప్పుల, అక్టోబరు 19: గ్రామ ప్రజల సుఖసంతోషాలు, పాడిపంటల సమృద్ధి, రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వాచ్యాతండా గ్రామ సర్పంచ్ గుగులోత్ లలిత రాజు నాయక్ ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా సోలిపురంలోని నల్లమ్మపోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
- 2గ్రామం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని అమ్మవారిని వేడుకున్నారు.
- 3రైతులకు మంచి పంటలు పండి, పల్లె పచ్చదనంతో కళకళలాడాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.
- 4గ్రామ ప్రజల బాగోగులే తన బాధ్యతగా భావిస్తూ, సర్పంచ్ గుగులోత్ లలిత రాజు నాయక్ గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం ఆకాంక్షిస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం గ్రామస్థుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది.
తరిగొప్పుల, అక్టోబరు 19: గ్రామ ప్రజల సుఖసంతోషాలు, పాడిపంటల సమృద్ధి, రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వాచ్యాతండా గ్రామ సర్పంచ్ గుగులోత్ లలిత రాజు నాయక్ ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా సోలిపురంలోని నల్లమ్మపోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని అమ్మవారిని వేడుకున్నారు.
గ్రామ ప్రజల బాగోగులే తన బాధ్యతగా భావిస్తూ, సర్పంచ్ గుగులోత్ లలిత రాజు నాయక్ గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం ఆకాంక్షిస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం గ్రామస్థుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. రైతులకు మంచి పంటలు పండి, పల్లె పచ్చదనంతో కళకళలాడాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.
దసరా పర్వదినాన అమ్మవారి ఆశీస్సులతో గ్రామంలో ఐకమత్యం, ప్రశాంతత నెలకొని, అభివృద్ధి బాటలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.