యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని PACS సహకార సంఘం బ్యాంకులో అర్ధరాత్రి మద్యం సేవిస్తున్న ఉద్యోగులను పట్టుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మోత్కూరు PACS బ్యాంకు చైర్మన్ ఛాంబర్లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, దళారులతో కలిసి బ్యాంకు ఉద్యోగులు అర్ధరాత్రి మద్యం సేవిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
బ్యాంకు ఉద్యోగులు దళారుల వద్ద లంచం తీసుకుని అర్ధరాత్రి వేళల్లో రుణాలను మంజూరు చేస్తున్నారని, ఇది బ్యాంకు నిబంధనలకు విరుద్ధమని రైతులు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంపై వెంటనే స్పందించి, బాధ్యులైన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలపై bank అధికారులు ఇంకా స్పందించలేదు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. bank లో చోటు చేసుకున్న ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.










