జనగామ, జూలై 13
జవంగమిిచందిిింగత20ఏళగగడిోివితూతవఇందడతివిివంేఇంిథగృహదంించిోతూజివజడేశిడడిేషడడిగమంచమొంజజగమజిిివితితంఅందజేశ.
చిల్పూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన కాటికాపరి కుటుంబాలకు వెంటనే ఇంటి స్థలాలు, గృహ సదుపాయం కల్పించాలని కోరుతూ బీఆర్ఎస్ జిల్లా యువజన నాయకుడు కేశిరెడ్డి రాకేష్ రెడ్డి, రాజవరం గ్రామ సర్పంచ్ మొటం రాజు సోమవారం జనగామ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి (గ్రీవెన్స్) కార్యక్రమంలో పాల్గొన్న వారు, రాజవరం గ్రామానికి చెందిన కాటికాపరి కుటుంబాలు గత 20 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని అత్యంత దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సొంత ఇల్లు గానీ, ఇంటి స్థలం గానీ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఇంటి స్థలాలు మంజూరు చేసి, గృహ నిర్మాణ సదుపాయం కల్పించేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
వినతిని సానుకూలంగా స్వీకరించిన జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులను వెంటనే విచారణ చేపట్టి నిబంధనల ప్రకారం అర్హులైన కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాటికాపరి కుటుంబాల సభ్యులు తమ సమస్యను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్న కేశిరెడ్డి రాకేష్ రెడ్డి, సర్పంచ్ మొటం రాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో తమకు న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో యాదగిరి, మాజీ మార్కెట్ డైరెక్టర్ రంగు హరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.









