తరిగొప్పుల, జూలై 10
అంకుషాపూర్ గ్రామపంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ బైకాని రమా బాలరాజు యాదవ్ పర్యవేక్షణలో రోడ్ల ఇరువైపులా పేరుకుపోయిన చెత్త, ముళ్లపొదలు, మురుగును తొలగించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ అంకుషాపూర్ గ్రామపంచాయతీ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టింది. స్థానిక సర్పంచ్ బైకాని రమా బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారులతో పాటు గ్రామంలోని పలు వీధుల ఇరువైపుల పెరిగిన గడ్డి, ముళ్లపొదలు, పేరుకుపోయిన చెత్తను గ్రామపంచాయతీ సిబ్బంది తొలగించారు. రోడ్లను శుభ్రపరచడంతో గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రమా బాలరాజు యాదవ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి పరిశుభ్రతతోనే ప్రారంభమవుతుందని అన్నారు. గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు ప్రతి గ్రామస్థుడు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన చెత్త సేకరణ కేంద్రాల్లోనే వేయాలని సూచించారు. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రజల సహకారం ఉంటే అంకుషాపూర్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను నిరంతరం కొనసాగిస్తామని, ప్రజల ఆరోగ్య పరిరక్షణే గ్రామపంచాయతీ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.











