ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
జనగామ పట్టణం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న వేళ మరో ఆధునిక వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రాండ్ ఎస్ఎల్ఎన్ లాడ్జి డీలక్స్ను సోమవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా లాడ్జి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. జనగామ పట్టణంలో ఆధునిక వసతులతో నూతన లాడ్జి అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. పట్టణం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి జనగామకు వచ్చే ప్రజలు, వ్యాపారులు, ఉద్యోగులు, సందర్శకులకు నాణ్యమైన వసతి సౌకర్యాలు అవసరమని పేర్కొన్నారు.
పట్టణంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తున్న క్రమంలో ఆధునిక సౌకర్యాలతో కొత్త సంస్థలు ఏర్పాటు కావడం ప్రజలకు మరింత సౌకర్యాన్ని కల్పిస్తుందన్నారు. జనగామ పట్టణానికి వచ్చే వారికి మెరుగైన వసతి, ఆతిథ్య సేవలు అందించేలా గ్రాండ్ ఎస్ఎల్ఎన్ లాడ్జి డీలక్స్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ప్రారంభ కార్యక్రమంలో లాడ్జి నిర్వాహకులు, సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.








