సిద్దిపేట, 15 November
కొమురవెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొల్లపల్లి పద్మ అంజనేయులు పాల్గొని చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారుల ఆనందం, విద్యాభివృద్ధి, ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సర్పంచ్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ కార్యదర్శి సీహెచ్ కర్ణాకర్, గ్రామ సిబ్బంది, గ్రామ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. వారంతా చిన్నారులతో కలిసి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

