సర్పంచ్ బోలగాని రేఖ బాపురాజు
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని అమ్మాపురం సర్పంచ్ బొలగాని రేఖ బాపురాజు సూచించారు. మండలంలోని అమ్మాపురం గ్రామంలో ఝాన్సీరాణి, సంతోషిమాత మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వం సూచించే మార్గదర్శకాలను పాటించి ధాన్యం విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కన్నెబోయిన రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ బైరగోని సురేందర్, పండ్ల బాలనర్సయ్య, ప్రజ్ఞపురం శ్రీధర్, పిట్టల రాజు, గంగం రాజిరెడ్డి, మధుసూదన్రెడ్డి, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బైరగోని రాజు, నీలం యాదగిరి, గంగం ప్రభాకర్రెడ్డి, ఝాన్సీరాణి, సంతోషిమాత మహిళా సంఘాల అధ్యక్షులు సాయబోయిన మమత, పండ్ల సరిత, వీవోఏలు కుంటి మంజు, మామిడాల స్వర్ణలత, ఆకునూరి అనిత, మాచర్ల కవిత, బైరగోని బాలమణి, ఇర్రి అనూష, రామిని వినోద, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సాయిబోయిన అంజనేయులు, గుంటిపల్లి అంజనేయులు, లగిశెట్టి లక్ష్మీనారాయణ, లింగాల ఉపేందర్, వార్డు సభ్యులు కుంటి మల్లయ్య, పొలబోయిన నరేష్, అల్వల అనిత తదితరులు పాల్గొన్నారు.








